calender_icon.png 21 May, 2025 | 11:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్లాస్టిక్‌తో మానవాళి ఆరోగ్యానికి ముప్పు

21-05-2025 12:00:00 AM

  1. పకడ్బందీగా సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయాలి

ప్రజల్లో చైతన్యం పెంచాలి

కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, మే 20(విజయక్రాంతి): జిల్లాలో సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ వినియోగంపై నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్లాస్టిక్ నిషేధంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మా ట్లాడుతూ.. పర్యావరణాన్ని ప్లాస్టిక్ తీవ్రంగా ప్రభావితం చేస్తోందని, ఇది మానవాళి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా ఇతర జీవరా శులకు కూడా ముప్పుగా మారిందని కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు.

120 మైక్రాన్ల క న్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని సూచించారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీ లు, మున్సిపాలిటీల్లో స్టీల్ బ్యాంకులను ఏర్పాటు చేసి ప్లాస్టిక్ ఉపయోగాన్ని తగ్గించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, మహి ళా స్వయం సహాయక సంఘాల సహకారంతో ఈ కార్యాచరణను ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు.

నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల తయారీ, విక్రయంపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఉల్లంఘించిన వారికి జరిమానాలు, వ్యాపార లైసెన్సులను రద్దు చేయడం సహా చట్టపరమైన చర్యలకు వెనుకాడరాదని అధికారులను హెచ్చరించారు. ప్లాస్టిక్ నిషేధానికి కృషి చేస్తున్న సంస్థలను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. గ్రామ సభలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం పెంచాలన్నారు.

ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా జూట్, పేపర్ సంచుల తయారీ కేంద్రాలను మహిళా సంఘాలచే ఏర్పాటు చేయాలని సూచించారు. దోమల నియంత్రణకు ఫాగిం గ్ యంత్రాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీవోలు రత్నాకళ్యాణి, కోమల్ రెడ్డి, జడ్పిసిఈవో గోవింద్, డిఆర్‌డిఓ విజయలక్ష్మి, డిపిఓ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్లు, జగదీశ్వర్ గౌడ్, రాజేష్ కుమార్ పాల్గొన్నారు.