calender_icon.png 21 May, 2025 | 12:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టైగర్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేస్తాం

21-05-2025 12:00:00 AM

  1. ఎఫ్‌ఏపీటీ శాంతారామ్

సమన్వయంతో సమగ్ర దర్యాప్తు 

పులి చర్మం, గోర్లు, దవడలు స్వాధీనం

ప్రస్తుతం ఎన్ని పులులు ఉన్నాయో.. చెప్పలేం

కాగజ్‌నగర్, మే 20 (విజయక్రాంతి): పులుల కదలికలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు చేస్తామని ఎఫ్‌ఏపీటీ శాంతారామ్ అన్నారు. వేటగాళ్లు విద్యుత్ తీగలు అమర్చి ఏడు ఏళ్ల ఆడ పులిని హతమార్చిన విషయం తెలిసిం దే. మంగళవారం కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్ కార్యాలయంలో జిల్లా ఆటవిశాఖ అధికారి నీరజ్ కుమార్‌తో కలిసి వివరాలు వెల్లడించారు.

జిల్లాలోని ఈనెల 17న పెంచికల్ పెట్ మండలం ఎల్లూరు అటవీ ప్రాం తంలో ఆడపులి కళేబరం అవశేషాలు స్వాధీ నం చేసుకున్నట్లు వివరించారు. ఈ విషయంపై బెల్లంపల్లి, కాగజ్‌నగర్ అటవీశాఖ అధికారులతో పాటు సంబంధిత అధికారుల సమన్వయంతో సమగ్ర దర్యాప్తు చేసి నిందితులను గుర్తించడం జరిగిందని వివరించారు. దహెగాం చిన్నరాస్‌పల్లి గ్రామాని కి చెందిన శేఖర్ ఇంటి ఆవరణలో బాక్సులో పులి ఆవేశాలు లభించాయని తెలిపారు.

పులిచర్మం, గోర్లు, దవడతో పాటు పలు ఆవేశాలను నిందితుల సమక్షంలో వెలికి తీసిన ట్లు తెలిపారు. మృతి చెందిన ఆడపులిని ఈనెల 13న బెజ్జూర్ మండల అటవీ ప్రాం తంలో గుర్తించినట్లు తెలిపారు. బెజ్జూర్ ఫారెస్ట్ నుండి పెంచికల్పేట్ ఫారెస్ట్ చేరుకున్న పులి వేటగాళ్ల ఉచ్చులో ఈనెల 14న బలైందన్నారు.అటవీ ప్రాంతానికి సమీపం లో ప్రధాన విద్యుత్ తీగలు ఉండడంతోనే వేటగాళ్లు సులువుగా విద్యుత్ తీగలు అ ర్చి పులిని వేటాడినట్లు స్పష్టం చేశారు.

విద్యుత్ తీగలను తొలగించాలని సంబంధిత శాఖ అధికారులకు పలు దఫాలుగా లేఖలు రాసినప్పటికీ స్పందించడం లేదన్నారు. మంచి ర్యాల జిల్లా కేంద్రంలో టైగర్ మానిటరింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. తద్వారా ఎప్పటికప్పుడు పులుల సమాచారం తెలుసుకోవడం జరుగుతుందన్నారు. నిందితుల నుండి పులి అవశేషాలతో పాటు వేటకు ఉపయోగించిన విద్యుత్ తీగ, ద్విచక్ర వాహనం, కత్తులు, తదితర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

కొద్దిరోజుల క్రితం సిర్పూర్ మండలంలోని ఇటిక్యాలపహాడ్ అటవీ ప్రాంతంలో పులి బాదముద్ర గుర్తించడం జరిగిందని, ప్రస్తుతం కారిడార్‌లో ఎన్ని పులులు ఉన్నాయన్న విషయం చెప్పలేమని స్పష్టం చేశారు.

నలుగురు నిందితులను విచారిస్తున్నామని, నిందితులతో మహారా ష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన స్మగ్లర్లతో ఏమైనా సంబంధాలు ఉన్నాయన్న కోణం లో విచారణ జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో వైల్ లైఫ్ క్రైం సిఐ జయప్రకాష్, ఎఫ్‌ఆర్వో అనీల్, పశు వైద్యాధికారి రాకేశ్, ఆటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.