11-11-2025 12:00:00 AM
- విజయ క్రాంతి కథనానికి స్పందించి తొలగించిన కాంగ్రెస్ నాయకులు
- 3 కిలోమీటర్ల మేర తొలగింపు
- మిగతా 43 కిలోమీటర్లు తొలగించాలనిడిమాండ్
కన్నాయిగూడెం,నవంబర్10(విజయక్రాంతి) ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల ప్రజల ప్రాణాలకు ఎవరు దిక్కని‘విజయక్రాంతి‘ పత్రికలో కథనం ప్రచురిం చబడింది.ఇలా తుపాకులగూడెం టూ ఏ టూరునాగారం వెళ్ళే ప్రధాన రహదారికి ఉన్న సమస్య గురించి ప్రజలకు బాటసారులకు వాహనాదారులకు జరుగుతున్న ఇ బ్బందుల గురించి ‘విజయక్రాంతి పత్రిక‘ వరస కథనాలను రాస్తుంది.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు కంజా సూర్య స్పందించి ఏటూరు వాగు నుంచి కంతనపల్లి రోడ్డు వరకు మూడు కిలోమీటర్ల దూ రం వరకు ఈ ప్రధాన రహదారికి ఇరువైపులా దట్టమైనబొంత బొంతచెట్లు ముళ్లపొ దలు పిచ్చి మొక్కలు పెరిగిఉన్న వాటిని తీసేశారు. ఏటూరునాగారం నుంచి తుపాకుల గూడెం వరకు దాదాపు 45 కిలోమీటర్ల మ ద్య దూరం ఉంటుంది.
ఈ రోడ్డు మొత్తం కూడా ప్రమాదంగా ఆర్&భీ అధికారులు ఎం దుకు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు పార్టీ నాయకులు రోడ్డుకు ఇరువైపులా ఉన్న పొదలను తీపి స్తూ పనులు చేస్తుంటే ఆర్&భీ అధికారులు మాత్రం జీతం తీసుకుంటున్నారని ప్రయాణికులకు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనిఈ ప్రమాదాలు కేవలం ఆర్&భీ అధికారుల నిర్లక్ష్యం వల్ల జరుతున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. కన్నా యిగూడెం మండలంగా ఏర్పాటు అయి సం‘రాలు గడుస్తున్నా కన్నాయిగూడెం మం డలంలో అబివృద్ది లేకపోవడంతో మండల పరిషర గ్రామాల ప్రజలు ఎలాంటి పనుల కోసమైనా సభ్ డివిజన్ ఏటూరునాగారం వెల్లవలసి వస్తుంది ఎంతటి ఎమర్జెన్సీ అయి నా ఈ రహదారిపైనే పోవాలి ఈ ప్రధాన రహదారి వెంట అన్నీ బొంత పొదలు దారి మీదకు వచ్చి ఆ బొంతచెట్లు మరియు తీగలు వాహనాదారులను ఇబ్బంది పెడుతున్నాయి.
దీనికి తోడు ఈ రోడ్డు మొత్తం మూల మలుపులు ఉన్నాయి. వీటి వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు దగ్గరకు వచ్చే వరకు కనిపించడం లేదు. దీని వల్ల ఎప్పుడు ప్రమాదాలు సంభవిస్తాయేనని ప్రజలు భ యపడుతున్నారు. ఈ ప్రధాన రహదారికి ఇరువైపులా దట్టమైనబొంత బొంతచెట్లు ముళ్లపొదలు పిచ్చి మొక్కలు పెరిగి ప్రయాణికులకు,పాదాచారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అసలే ఈ మార్గంలో మూ ల మలుపులు ఎక్కువగా ఉండగా దీనికి తో డు ఆ మూలమలుపుల వద్ద పెద్ద పెద్ద బొం త చెట్లు, పొదలు పెరిగి ఎదురుగా వచ్చే వాహనాలు కనబడకుండా చేస్తున్నాయి.భ యంతో రాత్రిపగలు తిరుగుతుంటాం బొం త పొదల కారణంగా ప్రయాణం ప్రమాదకరంగా మారుతుంది.
పొంచి ఉన్న ప్రమాదం ప్రమాదం పొంచి ఉన్న
పొద్దున పూట జాగ్రత్తగా వెళుతున్నాం, రాత్రి సమయంలో ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణిస్తున్నాం. తదితర గ్రామాల నుండి ప్రజలు జిల్లా మరియు డివిజన్ కేం ద్రాలకు వెళ్లాలంటే ఈ రహదారి గుండనే వె ల్లాలి వివిధ రకాల అవసరాలు, బ్యాంకు ప నులను, మార్కెట్, నిత్యావసర సరుకులు ఇ తరత్రా పనుల కోసం ఏ వస్తువు కావాలన్నా ఈ రోడ్డు నుంచే ప్రజలు జిల్లా మరియు స బ్ డివిజన్ కేంద్రాలకే వెల్ల వలసి ఉంటుంది రాత్రి సమయంలో మాత్రం పరిస్థితులు చా లా దారుణంగా ఉంటున్నాయి. రోజూ ఇదే రోడ్డులో వాహనాలు నడుపుకుంటూ బొం త పొదలు,పిచ్చిమొక్కలు రోడ్డుపైకి వస్తున్న చెట్ల కొమ్మల కారణంగా రాకపోకలు ప్రమాదకరంగా మారుతున్నాయి.
తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నాం. టూ విలర్ మీద సా ధారణ వేగంతో వెళుతున్నప్పుడు కూడా చిన్న ప్రమాదం జరిగినా ప్రాణాలు నష్టపోయేంత ప్రమాదకరంగా మారింది బొంత పొదలు తొలగిస్తే రాకపోకలు సురక్షితంగా ప్రజలు ప్రయాణాలు చేస్తారు మండలంలో ఇలాంటి పరిస్థితులు చాలా గ్రామాల రహదారులకు ఉన్నాయి. వెంటనే అధికారులు గ్రామల్లోని అన్ని రోడ్ల మార్గాల్లో బొంత పొ లాలను పిచ్చి మొక్కలను ముళ్ల పొదలను తొలగించి ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుని ప్రయాణికులకు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆర్&భీ అధికారులు చేస్తారా వేచిచూడాలి.