calender_icon.png 10 August, 2025 | 9:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్మశాన వాటికలో పిచ్చి మొక్కల తొలగింపు

10-08-2025 05:52:10 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): శ్మశాన వాటికలో పిచ్చి మొక్కలు పెరిగి అంత్యక్రియలు నిర్వహించడానికి వెళ్లే వారికి ఇబ్బందులు కలుగుతుండగా స్వచ్ఛందంగా ఓ వ్యక్తి సొంత ఖర్చులతో పిచ్చి మొక్కలు తొలగించిన ఘటన ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం (వీ)లో జరిగింది. కేసముద్రం బల్దియా పరిధిలోని కేసముద్రం(వీ)లో ఉన్న శ్మశాన వాటికలో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి, ఇటీవల మరణించిన పలువురికి అంత్యక్రియలు నిర్వహించేందుకు వెళ్లిన వారికి అసౌకర్యంగా మారింది. దీనికి తోడు ఆదివారం నాడు మరో వ్యక్తి మరణించగా అంత్యక్రియలు చేయడానికి అసౌకర్యంగా ఉండడంతో గ్రామానికి చెందిన గుండు దామోదర్ సొంత ఖర్చులతో డోజర్ ట్రాక్టర్ ద్వారా పిచ్చి మొక్కలను తొలగించాడు.