calender_icon.png 2 May, 2025 | 8:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోండామార్కెట్ వద్ద నల్లా పైప్‌లైన్ లీకేజీకి మరమ్మతు

28-04-2025 01:39:09 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 27(విజయక్రాంతి) : జలమండలి ఓఅండ్‌ఎం డివిజన్ నంబర్ పరిధిలోని మోండామార్కెట్ వద్ద 350 డయా ఎంఎం నల్లా పైప్‌లైన్ లీకేజీని అధికారులు గుర్తించి పరిష్కరించారు.

రద్దీగా ఉండే రహదారిపై ఏర్పడిన ఈ లీకేజీ కారణంగా నగరంలోని మలకుంటరోడ్, రిసాలా అబ్ధుల్లా, ఒస్మాన్‌గంజ్, శంకర్‌బాగ్, టాప్‌ఖానా ప్రాంతాల్లోని దాదాపు700ఇండ్లకు నీటి సరఫరా ప్రభావితం అయ్యే అవకాశం ఉన్నట్లు గుర్తించి అధికారులు తక్షణమే సమస్యను పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు.

ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగకుండా ట్రాఫిక్, పోలీస్, అధఙకారులతో సమన్వయంతో పనులు చేపట్టి సమస్యను పరిష్కరించినట్లు పేర్కొన్నారు. కాగా ప్రధాన రహదారిపై ఏర్పడిన లీకేజీ సమస్యను పరిష్కరించి నీటి సరఫరాను పునరుద్ధరించిన జలమండలి అధికారులు, సిబ్బందిని ఆ సంస్థ ఎండీ అశోక్‌రెడ్డి అభినందించారు.