సాగునీరు విడుదలకు ముందే జూరాల కాలువలకు మరమ్మతులు చేపట్టాలి
23-06-2026 12:15 AM
ఇటిక్యాల, జూన్ 22: ఇటిక్యాల మండలంలో ప్రవహించే ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు అనుసంధాన కాలువల పరిస్థితి అత్యంత అధ్వానంగా తయారైంది. కాలువలు పలుచోట్ల బీటలు వారి, పగుళ్లు ఏర్పడి ప్రమాదకరంగా మారినా సంబంధిత అధికారులు కన్నెత్తి చూడడం లేదని స్థానిక రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సాగునీరు విడుదలకు ముందే జూరాల కాలువలకు మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు






