02-08-2025 02:23:00 AM
హైదరాబాద్ సీటి బ్యూరో, ఆగస్టు 1 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సి పల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నగరంలోని ప్రధాన రహదారులపై రోడ్ సేఫ్టీ డ్రైవ్ కొనసాగుతోంది. శుక్రవారం రోడ్ల మరమ్మతులు, కాచ్‌పీట్లు, సెంట్రల్ మీడియన్ మరమ్మతులు చేపట్టబడ్డాయి. నగరంలోని ఆరు జోన్లలో ఈ కార్యక్రమం సాగింది. నగరంలో శుక్రవారం మొత్తం 462 బిటి సిమెంట్ కాంక్రీట్ పాట్ హోల్స్ నింపారు.
23 క్యాచ్‌పిట్‌లు మరమ్మతు చేయడంతో పాటు 8 క్యాచ్ పిట్ కవర్లు మార్చారు. ఎల్బీనగర్ జోన్‌లో133 పాట్ హోల్స్, 10 కాచ్‌పిట్లు, 7 కవర్లు మార్చారు. చార్మినార్ జోన్‌లో 52 పాట్ హోల్స్, 9 క్యాచ్ పిట్‌లు, ఖైరతాబాద్ జోన్ లో63 పాట్ హోల్స్ పూడ్చారు. శేరిలింగంపల్లి జోన్‌లో55 పాట్ హోల్స్ పూడ్చారు. కూకట్పల్లి జోన్‌లో85 పాట్ హోల్స్ పూడ్చా రు.
సికింద్రాబాద్ జోన్ లో74 పొత్హోల్స్, 4 కాచ్‌పిట్లు పూడ్చారు. నగర వ్యాప్తంగా ఇప్పటి వరకు 7,258 పాట్ హోల్స్ (గుంతలు) పూడ్చగా, 333 క్యాచ్ పిట్‌లకు మరమ్మతులు చేశారు. 114 క్యాచ్ పిట్ లు మార్చరు. 3 ప్రాంతాల్లో సెంట్రల్ మీడియన్ మైనర్ మరమ్మతులు చేశారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి, రహదారి భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటోందని కమిషనర్ ఆర్‌వి కర్ణన్ తెలిపారు.