02-08-2025 02:24:19 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 1 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం క్రీడా శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ హెచ్‌ఐసిసి, నో వాటేల్‌లో శనివారం నిర్వహించనున్న స్పో ర్ట్స్ కాన్‌క్లేవ్‌కు సర్వం సిద్ధమైంది. తెలంగాణ క్రీడా విధానం2025ను యావత్ క్రీడా స మాజానికి విస్తృత స్థాయిలో పరిచయం చేసేందు కు, క్రీడా విధానం అమలులో అందరి భాగస్వామ్యం పెంచేందుకు ఉద్దేశించిన ఈ కాంక్లే వ్‌కు కావలసిన ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు.
చారు శర్మ, భారత క్రికెట్ మాజీ ఒలంపియన్లు పుల్లెల గోపీచంద్, గగన్ నారం గ్, అంజు జార్జ్ వివిధ క్రీడా ఫెడరేషన్ల ప్రతినిధులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, క్రీడా జర్నలిస్టులు విశ్వనాథన్ సభ నాయక్‌తోపాటు సీనియర్ క్రీడా జర్నలిస్టులు భాగస్వా ములు అవుతున్నారు. ఈ విధానం ప్రధానంగా పటిష్టమైన క్రీడా పరిపాలన, దీర్ఘకాలిక క్రీడల అభివృద్ధి, కెరియ ర్, ఉపాధి మార్గాల రూపకల్పన, క్రీడా మౌ లిక సదుపాయాల కల్పన, సమగ్ర క్రీడా వా తావరణ కల్పన వంటి అంశాలపై దృష్టి సా రించనుంది.
గత ఏడాది నుంచి సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనల మేరకు ఒక సమగ్రమైన పటిష్టమైన క్రీడా విధానం తీసుకురావాలన్న సంకల్పంతో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఎంతో కృషి చేసింది. ఫిఫా వంటి గ్లోబల్ క్రీడా సంస్థలతో పాటు ప్రముఖ కార్పొరేట్లు, క్రీడా నిపుణులతో రాష్ట్రం ఎంవోయూస్ చేసుకుంటోంది. క్రీడా శాఖ, శ్రమ, రాష్ట్ర ప్రభుత్వ సహకారం, సీఎం రేవంత్ పట్టుదలతో నూతన క్రీడా విధానెేం2025 రూపు దిద్దుకుందని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు.