calender_icon.png 25 May, 2025 | 10:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోరు మోటర్‌కు మరమ్మతులు

24-05-2025 12:49:13 AM

జుక్కల్, మే 23 (విజయక్రాంతి) : జుక్కల్ మండలంలోని బసవపూర్ గ్రామంలో గత మూడు రోజులుగా కరెంటు సరఫరా లేక ‘తాగునీటి ఎద్దడి‘ అనే శీర్షికతో ఈనెల 21న విజయ క్రాంతిలో కథనం ప్రచురితమైంది. కథనానికి ట్రాన్స్కో అధికారులు స్పందించారు.

ఈనెల 22న బోరు మోటర్ ను మరమ్మతులు చేసి కరెంట్ సరఫరా చేయగా తాగునీటి ఎద్దడికి నివారణ కోసం చర్యలు చేపట్టినట్లు ట్రాన్స్ఫర్ సిబ్బంది తెలిపారు. కరెంటు సరఫరా కాగానే గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంకులకు నీరు అందించి తద్వారా ఈనెల 23న గ్రామానికి మంచినీరు అందిందని గ్రామస్తులు చెప్పారు. దీంతో గ్రామస్తులు ట్రాన్స్కో అధికారులు నిర్లక్ష్యం వీడి ఇలాంటి సంఘటనలో పునరావృత్తం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు సమస్య తీరడంతో వర్షం వ్యక్తం చేశారు.