calender_icon.png 25 May, 2025 | 4:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అకాల వర్షం.. అపార నష్టం

24-05-2025 12:46:09 AM

-ధాన్యం రాశుల్లోకి చేరిన వాన నీరు 

-ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల విజ్ఞప్తి

నిజామాబాద్ మే 23, (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షంతో రైతులకు భారీ నష్టం సంభవిస్తోంది.  ఈదురు గాలులు ఉరుములు మెరుపులతో కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తోంది.  పొలాలతోపాటు రహదారుల వెంబడి అనువైన ప్రాంతాల్లో ఆరబోసిన ధాన్యం అకాల వర్షానికి పూర్తిగా తడిసిపోయింది. 

అకాల వర్షం నుండి కష్టపడి పండించిన ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు పడుతున్న పాట్లు వర్ణాతీతం.  కళ్ళల్లో ధాన్యాన్ని ఆరబోసి 20 రోజులు గడిచిన అప్పటికిని ధాన్యం కొనుగోలు విషయంలో జరిగిన జాప్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. ధాన్యం ఏ మేరకు తడిసింది అన్న విషయంలో వ్యవసాయ శాఖ అధికారులకు ఇప్పటికీ స్పష్టత లేదు.

ఒకవైపు వర్షాల వల్ల ధాన్యం తడిసి ముద్ద అవుతున్నప్పటికీ అధికారులు తమకు పట్టనట్టుగా వ్యవహరి స్తున్నారని ఆరోపణలు రైతులు నుండి వస్తున్నాయి.  ధాన్యం కొనుగోలు విషయాల్లో ధాన్యం ట్రాన్స్పోర్ట్ విషయంలో జరుగుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరీక్షించడానికి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు క్షేత్రస్థాయి పరిశీలనను జరుపుతూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు సంబంధి త అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ బోధన్ లలోని పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది.

బాల్కొండ ఆర్మూర్ మోపాల్ సాలు రా సిరికొండ ధర్పల్లి రామడుగు చిన్న వాల్ గాడ్ రావుట్ల నేవనంది కొండూరు సిరికొండ హుస్సేన్ నగర్ తో పాటు నందిపేట్ నవీపేట్ కొండాపూర్ గడ్కోల్ సిరికొండ ఐలాపూర్ శ్రీనగర్ మాకూర్ గొట్టుముక్కల గ్రామాలలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షం నీటి ప్రవాహానికి ఆరబోసిన ధాన్యం కొట్టుకు పోయాయి.  లోతట్టు ప్రాంతాల్లో ఆరబోసిన ధాన్యం వరద నీటికి కొట్టుకుపోగా పొలాల్లో ఎండబెట్టిన ధాన్యం లో నీళ్లు నిలచిన దృశ్యం రైతులను కంటతడి పెట్టించింది తడిసిన ధాన్యంలో నుంచి గోనెసంచుల ద్వారా నీటిని తొలగించే ప్రయత్నాలు రైతులు చేస్తున్నారు.

  కుప్పలుగా పోసిన ధాన్యం లోకి వర్షపు నీళ్ళు చేరకుండా వాట్సాప్ నీటి నుండి ధాన్యాన్ని కాపాడుకోవడానికి టార్పాలిన్లను కప్పుకోవడంతో కొందరు రైతులు జాగ్రత్త పడగా.. ఆ ప్రయత్నంలోనే మరికొందరు రైతులు తీవ్రంగా నష్టపోయారు.  బుధ గురు శుక్రవారాం కురిసిన వర్షంతో.. ఆరబోసిన ధాన్యం కళ్ళలలోకి రైతులు పరుగులు పెట్టారు.  ధాన్యాన్ని ఆరబెట్టి తరలించడానికి సిద్ధంగా ఉంచే తరుణంలో హఠాత్తుగా కురుస్తున్న వర్షాలు అన్నదాతలను తీవ్ర నష్టానికి గురిచేస్తున్నాయి. 

ఉన్నటువంటి వరకు అంతరించి పోయిన భూగర్భ జలాలతో పంటలను కాపాడుకోలేక నానా అవస్థలు పడ్డ రైతులకు కొద్ది గొప్ప చేతికొచ్చిన ధాన్యం ఆరబోసే తరుణంలో వడగండ్ల వాన  అకాల వర్షం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.  ధాన్యంతో నిండిన సంచుల కింద కూడా వర్షపు నీరు చేరడంతో సంచుల్లో ఉన్న ధాన్యం పూర్తిగా తడిసిపోయింది.  ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు తడిసిన ధాన్యాన్ని పరిశీలించి ప్రభుత్వమే తమ పంటను కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు ప్రజాప్రతినిధుల ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.