calender_icon.png 9 October, 2025 | 10:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీ అండ్ టీ కాలనీలో నాలాపై కప్పుకు మరమత్తులు

09-10-2025 12:54:45 AM

ముషీరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): భోలక్ పూర్ డివిజన్ పీ అండ్ టీ కాలనీలో కచ్చా నాలా పై కప్పు అద్వాన స్థితికి చేరుకోవడంతో బుధవారం నాలా పై కప్పు పునర్నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ అధికారులు పనులు ప్రారంభించారు. స్థానిక డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు వై. శ్రీనివాసరావు, జీహెచ్‌ఎంసీ డీఈ సన్నీ, వర్క్ ఇన్స్పె క్టర్ దాసు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వై.శ్రీనివాస్ రావు మాట్లాడుతూ..

స్థానిక ప్రజలు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉండడంతో స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ దృష్టికి తీసుకెళ్లి పైకప్పు పనులు చేపట్టేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అధికారులు ప్రజా సమస్యల పరిష్కారానికి వెంటనే కృషిచేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో భోలక్ పూర్ డివిజన్ బీఆర్‌ఎస్ ఉపాధ్యక్షుడు ఎ. శంకర్ గౌడ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.