calender_icon.png 18 May, 2025 | 9:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరు శాతం పెరిగిన రెప్కో లాభం

18-05-2025 12:00:00 AM

రూ.115 కోట్లుగా నెట్ ఫ్రాఫిట్ 

చెన్నై, మే 17: రెప్కో గృహనిర్మా ణ సంస్థ నాలుగో త్రైమాసికంలో 6 శాతం మేర లాభాలు ఆర్జించింది. పోయినేడాది నాలుగో త్రైమాసికం లో రూ. 108 కోట్లుగా ఉన్న నెట్ ఫ్రాఫిట్ తాజాగా రూ. 115 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం 10 శాతం పెరిగి రూ. 397 కోట్ల నుంచి రూ. 435 కోట్లకు చేరుకుంది.

2025 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ వార్షిక లాభం రూ. 439 కోట్లుగా ఉండి గతేడాదితో పోల్చినపుడు 11 శాతం మేర పెరగడం గమనార్హం. రెప్కో సంస్థ అన్ని రంగాల్లో పెరుగుదలను నమోదు చేసింది. మార్చి 31 2025 వరకు దేశవ్యాప్తంగా కంపెనీకి 189 బ్రాంచిలు, 42 శాటిలైట్ సెంటర్లు ఉన్నాయి. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, ఒడిషా, గుజరాత్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, రాజ స్థాన్, పాండిచ్చేరిల్లో బ్రాంచి లు, శాటిలైట్ సెంటర్లు ఉన్నాయి.