26-01-2026 07:50:09 PM
కొల్చారం: గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం కొల్చారం మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయాన్నే మండలంలోని గ్రామాల్లో ఆయా గ్రామాల పాఠశాల విద్యార్థులు యువకులు జాతీయ గీతాలాపనలు చేస్తూ ప్రభాత ర్యాలీ లు నిర్వహిస్తూ ఆయా గ్రామాలలో ఏర్పాటుచేసిన జాతీయ జెండాలను ఆవిష్కరించారు.
మండల కేంద్రమైన కొల్చారంలో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ దేవన్న శేఖర్, పోలీస్ స్టేషన్లో ఎస్సై మొయినుద్దీన్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ఎంపీడీవో రఫీ ఉన్నీసా బేగం, తాసిల్దార్ కార్యాలయం వద్ద తహసిల్దార్ శ్రీనివాసచారి, మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఏవో శ్వేతాకుమారి, మండలంలోని వివిధ గ్రామాలలోని గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద వద్ద ఆయా గ్రామాల సర్పంచులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సందర్భంగా ఆయా గ్రామాల్లోని పాఠశాలలలో విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలపై పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.