26-01-2026 07:42:38 PM
మర్రిగూడ,(విజయక్రాంతి): శాంతి భద్రతల పరిరక్షణ వృత్తిపరంగా ఉత్తమ ప్రతిభ అంకితభావంతో పనిచేస్తూ నాంపల్లి సర్కిల్ పరిధిలో చింతపల్లి మర్రిగూడ నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు అక్కడి సిబ్బంది ఎస్ఐలతో సహా అప్రమత్తతో ఉంటూ సేవలందించిన నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ రిపబ్లిక్ డే సందర్భంగా ఉత్తమ సేవా పురస్కారమును జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ చేతుల మీదుగా అవార్డును ప్రశంసా పత్రాన్ని అందజేశారు. పురస్కారము అందుకున్న సీఐ దూది రాజుకు సర్కిల్ పరిధిలోని అధికారులు సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు