26-01-2026 07:53:33 PM
ఉపాధి హామీని పథకం పునరుద్ధరించాలి
డీసీసీ ప్రెసిడెంట్ ఆంక్ష రెడ్డి
సిద్దిపేట రూరల్: పేదల వ్యతిరేకి బీజేపీ ప్రభుత్వం అని డీసీసీ ప్రెసిడెంట్ ఆంక్ష రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని బుస్సాపూర్, నారాయణ రావు పేట మండలంలోని కోదండరావు పల్లి గ్రామాలలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా అవిష్కరణ చేశారు. అనంతరం గ్రామంలోని రైతులు, ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ ఉపాధి హామీని పథకం పునరుద్ధరించితేనే రైతులకు మేలు జరుగుతుందని అన్నారు.
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సోనియా గాంధీ కృషివల్ల ఉపాధి హామీ హక్కు పథకం ద్వారా సంవత్సరానికి ప్రతి పేదవాడికి 150 రోజుల పనిదినాలు కలిపించిందని, వారు కోరుకున్న చోట పని కలిపించి పేదవారికి ఉపాధి కలిపించిందన్నారు. ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టం విబి జి రామ్ జీ చట్టం ద్వారా కేంద్రం నోటిఫై చేసి బడ్జెట్ కేటాయిస్తే మాత్రమే ప్రజలకు పని లభిస్తుందన్నారు. ప్రజలు కోరుకుంటే పని కలియించె పరిస్థితి నుండి ,ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే పని కలిపించె విదంగా ఉన్న ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు.
కొత్త చట్టం ద్వారా జరుగుతున్న మోసాన్ని ప్రజలకు వివరించి, బీజేపీ ప్రభుత్వంపై పెద్దఎత్తున్న నిరసన కార్యక్రమాలు చేపడుతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బుస్సపూర్ గ్రామ మాజీ సర్పంచ్ కేదారి సదాశివ రెడ్డి, సిద్దిపేట ఆర్టిఏ నెంబర్ సూర్య వర్మ టిపిసిసి నెంబర్ దరిపల్లి చంద్రం మార్కా సతీష్ డిసిసి వైస్ ప్రెసిడెంట్ మoదా పాండు, మహిళా ఉపాధ్యక్షురాలు మంద వనజ ఫిషరీస్ జనరల్ సెక్రెటరీ సురేష్, సిద్దిపేట రూరల్ మండల గ్రామ శాఖ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రైతులు ఉపదామి కూలీలు పాల్గొన్నారు