calender_icon.png 26 January, 2026 | 5:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

26-01-2026 03:43:58 PM

దేవరకొండ,(విజయక్రాంతి): గణతంత్ర దినోత్సవ సందర్భంగా దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనములో ఉదయం 7 గంటల 30 నిమిషాలకు అధ్యక్షుడు NVT సభ్యులతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించి అమరవీరులకు జోహార్లు అర్పించినారు. అనంతరం మాట్లాడుతూ... 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి, దేశం సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా మారిన సందర్భంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారని, 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చినప్పటికీ, 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి రావడంతో భారత్ పరిపూర్ణ గణతంత్ర దేశంగా అవతరించింది.

రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలను స్మరించుకుంటూ, ప్రజాస్వామ్య బాధ్యతలను గుర్తుచేసుకునే రోజు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణ కిషోర్, తాళ్ల సురేష్, వల్ల మల్ల ఆంజనేయులు, మాకం మహేష్, నరేష్ ,కరాటే మాస్టర్ గోపి, శ్రీనయ్య, జమీర్, శోభన్,వంగూరి వెంకటేశ్వర్లు, మహేందర్, నాగరాజు, కృష్ణవేణి, టాలెంట్ స్కూల్ విద్యార్థులు క్రీడాకారులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.