calender_icon.png 2 July, 2025 | 4:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రహ్మణ్ గావ్ ఎత్తిపోతల పథకానికి నిధుల మంజూరు

01-07-2025 08:29:34 PM

బైంసా (విజయక్రాంతి): గోదావరి నదిపై బ్రహ్మణ్ గావ్ ఎత్తిపోతల పథకం మరమ్మత్తులకు రూ.5 .88 కోట్ల నిధులు మంజూరయ్యాయని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్(MLA Pawar Rama Rao Patel) తెలిపారు. 2013 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం 6100 ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా 80 కోట్లతో పనులు పూర్తిచేస్తే, బీఆర్ఎస్ పాలకుల నిర్లక్ష్య వైఖరి మూలంగా రైతాంగానికి చుక్క సాగునీరు అందలేదన్నారు. ఎత్తిపోతల పరికరాలు, ట్రాన్స్ఫార్మర్లు దొంగల పాలయ్యాయని అన్నారు. మరమ్మత్తులకు నిధులు కోసం పలుమార్లు అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగిందన్నారు. నీటి పారుదల శాఖ మంత్రి ఇచ్చిన మాట ప్రకారం 5.88 కోట్ల నిధులు మంజూరు చేశారన్నారు. దీంతో రైతుల సాగునీటి సమస్య తీరుతుందని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి, ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు, మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.