01-07-2025 08:34:11 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మంగళవారం జాతీయ వైద్యుల దినోత్సవం(National Doctors Day) ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సూపర్డెంట్ డాక్టర్ రవి కేక్ కట్ చేసి, డాక్టర్స్, ఆసుపత్రి సిబ్బందినీ శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి మాట్లాడుతూ... వైద్యులు కోవిడ్-19, ఫ్లూ, ఎయిడ్స్, ఎబోలా, ఇతర అనారోగ్య పరిస్థితులను, సాధారణ ప్రజలను రక్షించడానికి వారు ఎల్లప్పుడూ ముందుగా ఉంటారన్నారు. నిరంతరం రోగి సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తారని, వారి ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వైద్యం చేస్తారని తెలిపారు.
ఇతరులకు సహాయం చేయడానికి తమ జీవితాలను అంకితం చేసే వ్యక్తులని, రోగుల వైద్య పరిస్థితితు లకు చికిత్స చేయడానికి ఆయురార్థం పెంచడానికి వారి జ్ఞానాన్ని అంకితం చేస్తారని, వారి సహకారాన్ని, అవిశ్రాంత ప్రయత్నాలను ఎవరూ మరిచిపోలేరని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు కిరణ్ కుమారి, పి.వి.వి. సత్యనారాయణ మూర్తి, షబ్బీర్, వరుణ్ కుమార్, సునీల్, సాకారం, సంజయ్ కుమార్, శ్రీధర్ రెడ్డి, సరిత, రవళి, సాహిత్య, స్వరూపరాణి, లాబ్ టెక్నీషియన్ శ్రీనివాస్, కార్యాలయ సిబ్బంది ప్రవీణ్, మహేష్, నర్సింగ్ సూపరింటెండెంట్ జోష్మిన్,హెడ్ నర్స్ షీలా, స్టెల్లా, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.