01-07-2025 08:15:55 PM
మందమర్రి (విజయక్రాంతి): జాతీయ వైద్యుల దినోత్సవ(National Doctors Day) వేడుకలు పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. పిహెచ్సిలో మంగళవారం ఏర్పాటు చేసిన వైద్యుల దినోత్సవం వేడుకల్లో పిహెచ్సి వైద్యులు రమేష్ ను సిబ్బంది ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులు రమేష్ మాట్లాడుతూ... ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో వైద్య సిబ్బంది సహకారం మరువ లేనిదనీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.