01-07-2025 08:20:17 PM
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): సమాజంలో వైద్య వృత్తి ఎంతో ఉత్తమమైనదని జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్(Corporator Kolukula Jagan) అన్నారు. డాక్టర్స్ డేను పురస్కరించుకొని జగద్గిరిగుట్ట ధన్వంతరి అనుభవ వైద్య సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జగద్గిరిగుట్టలోని కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు జగన్ చేతుల మీదుగా కేక్ కట్ చేపించి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం జగన్ మాట్లాడుతూ... వైద్యులను దేవునితో సమానంగా చూడడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ముఖ్యంగా పేద ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్న ఆర్ఎంపి, పిఎంపి డాక్టర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శ్రీనివాసరాజు, కుత్బుల్లాపూర్ అధ్యక్షులు విష్ణువర్ధన్, రవికుమార్, నిరంజన్ రెడ్డి, రాము, శోభన్ బాబు, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.