calender_icon.png 2 July, 2025 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చినుకు పడితే చిత్తడే

01-07-2025 08:44:28 PM

చెరువును తలపిస్తున్న మండల కేంద్రంలోని రోడ్లు...

తరిగొప్పుల (విజయక్రాంతి): మండల కేంద్రంలో అకాల వర్షాలకు రోడ్లలో మొత్తం నీరు నిండిపోవడంతో, సంతా నిర్వహించే ప్రాంతం అంతా చెరువుల తలపిస్తుంది. దీనివలన మండల ప్రజలతో పాటు వివిధ గ్రామాల ప్రజలు కూడా చాలా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. దీనిపై అధికారులు స్పందించి రోడ్డు భవనాల శాఖ వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని, గ్రామ పంచాయతీ స్పందించి కూరగాయల మార్కెట్ ప్రాంగణాన్ని నీరు నిలువ లేకుండా చేయాలని  గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.