calender_icon.png 2 July, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకే మెటీరియల్ సప్లై చేయాలి

01-07-2025 09:03:45 PM

వలిగొండ (విజయక్రాంతి): ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కోసం అవసరమయ్యే ఇనుము, సిమెంటు మార్కెట్ ధర కాకుండా తక్కువ ధరకు సప్లై చేయాలని మండల ప్రత్యేకాధికారి జగన్నాథ రావ్(Mandal Special Officer Jagannath Rao) దుకాణదారులకు సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మెటీరియల్ సప్లై దుకాణదారులతో నిర్మాణ మేస్త్రీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇండ్లు పేదవాళ్ళు మాత్రమే కట్టుకుంటున్నారని కావున ఇండ్లకు తక్కువ ధరకు సప్లై చేయాలని, మేస్త్రీలకు తక్కువ ధరకే నిర్మాణం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ దశరథ, ఎంపీడీవో జితేందర్ రెడ్డి, ఎస్ఐ రవీందర్ గౌడ్, ఎంపీఓ కేదారేశ్వర్, పంచాయతీరాజ్ ఏఈ సందీప్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, మేస్త్రి సంఘం ప్రతినిధులు, ట్రేడర్ల యజమానులు పాల్గొన్నారు.