01-07-2025 08:41:33 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) ఖానాపూర్ మున్సిపాలిటీలో ప్రతి వర్షకాలం పక్కనే ఉన్న అడవిలో నుంచి భారీ వరద ప్రవాహం వచ్చి జేకే నగర్, రాజీవ్ నగర్, విద్యానగర్, కాలనీలు ముంపుకు గురవుతున్న పరిస్థితుల నేపథ్యంలో వరద నీరు పట్టణంలోకి రాకుండా తగు చర్యలు చేపట్టాలని మాజీ మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం అన్నారు. ఈ మేరకు మంగళవారం స్థానిక అటవీ అధికారులు కిరణ్ కుమార్ సిబ్బందితో కలిసి పట్టణం పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలో వరదనీటి ప్రవాహాన్ని అడ్డుకునే చర్యలు చేపట్టేందుకు పరిశీలించారు. ప్రస్తుతం వానలు జోరందుకుంటున్న నేపథ్యంలో త్వరితగతిన చర్యలు తీసుకోవాలని చైర్మన్ కోరారు.