01-07-2025 08:52:14 PM
మందమర్రి (విజయక్రాంతి): జాతీయ వైద్యుల దినోత్సవం(National Doctors Day) వేడుకలను బహుజన సమాజ్ పార్టీ(Bahujan Samaj Party) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పిహెచ్సి వైద్యులు రాపాక రమేష్ ను ఘనంగా సన్మానించారు. గడిచిన రెండు సంవత్సరాలుగా మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్నారని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు నాగుల కిరణ్ బాబు, పట్టణ అధ్యక్షులు గాజుల శంకర్, మండల అధ్యక్షులు మతీన్ ఖాన్, నాయకులు షేక్ రహీమ్ బాబాలు పాల్గొన్నారు.