calender_icon.png 16 September, 2025 | 9:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్సు కోసం ఇంటికి ఒకరు ఆర్టీసీ డిపో కు మహిళలు

16-09-2025 07:17:21 PM

తమ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని వినతి

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మోషంపూర్ గ్రామం నుండి ఆర్టీసీ బస్సు కావాలని మహిళలు పెద్ద ఎత్తున మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోకు బయలుదేరి వెళ్లారు. డిపో మేనేజర్ కరుణశ్రీ అందుబాటులో లేనందువల్ల అసిస్టెంట్ మేనేజర్ లింగమూర్తికి విన్నవించారు. మోషంపూర్ గ్రామానికి గతంలో బస్సు వచ్చేదని ఇప్పుడు రావడం లేదని మా గ్రామానికి ఉదయం రెండు ట్రిప్పులు సాయంత్రం రెండు ట్రిప్పులు బస్సు నడపాలని ప్రైవేట్ వాహనాలు అధిక డబ్బులు వసులు చేస్తున్నారని ప్రమాదాలు జరుగుతున్నాయిని తెలిపారు. ఆర్టీసీ బస్సు అయితే సురక్షితంగా గమ్యాన్ని చేరుస్తుందని బస్సు సౌకర్యం తప్పకుండ వేయాలని విజ్ఞప్తి చేశారు.