25-07-2025 01:10:26 AM
ఆదిలాబాద్, జూలై 24 (విజయక్రాంతి): కేంద్ర పెట్రోలియం సహజవాయువు విభా గం మంత్రి హారదీప్ సింగ్, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌లను ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శం కర్ కలిశారు. గురువారం ఢిల్లీలో ముందు గా కేంద్ర మంత్రి హారదీప్ సింగ్‌ను కలిసి ఇంటింటికి సహజవాయువు గ్యాస్‌పైపు లైన్ ఏర్పాటు, ద్విచక్ర వాహనాలలోనూ సహజవాయు, విద్యుత్ ఛార్జింగ్ పాయింట్లు నెల కొల్పాలని కోరారు.
అనంతరం మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి ఆదిలాబాద్ టూ ఆర్మూర్ రైల్ మార్గానికి సర్వే పూర్తి చేయించి నిధులు విడుదల చేయాలన్నారు. అదేవిధం గా పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలని విన్నవించారు. ఆయా సమస్యలపై మంత్రు లు సానుకూలంగా స్పందించారని ఎంపీ, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. వారివెంట రాష్ట్ర నాయకులు ముస్తాపూర్ అశోక్ ఉన్నారు.