25-07-2025 01:12:22 AM
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఛత్రు నాయక్
మందమర్రి, జూలై 24: ఎరువులను డీల ర్లు అధిక ధరలకు అమ్మిన, ఇతర వస్తువులు కలిపి అమ్మిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి ఛత్రు నాయక్ తెలిపారు. గురువారం మండలంలోని పలు ఫెర్టిలైజర్ ఎరువుల దుకాణా లను, గోదాములను వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మండ ల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం, ఆదిల్ పేట గ్రామంలోని మూలికా ఫెర్టిలైజర్స్ ఎరువుల దుకాణాలను, గోదాములను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఛత్రు నాయక్, సహాయ వ్యవసాయ సంచాలకులు బానోత్ ప్రసాద్, మండల తహశీల్దార్ సతీష్ కుమార్, పట్టణ అదనపు ఎస్‌ఐ నూనె శ్రీనివాస్‌లు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి ఛత్రు నాయక్ మాట్లాడుతూ ప్రతి ఎరువుల దుకాణంలో స్టాకు నిలు వలు, ధరల పట్టిక రైతులకు కనపడేలా తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించారు. వ్యవ సాయ సాగు కొరకు మాత్రమే యూరియా అమ్మాలని, పారిశ్రామిక ప్రయోజనాలకు అమ్మకూడదని తెలిపారు. రైతులతో మాట్లాడుతూ, యూరియా, ఇతర ఎరువుల లబ్ధిత గురించి, వాటి ధరల గురించి అడిగి, రైతులకు ఇబ్బంది లేదని తెలుసుకున్నారు.
సీజన్‌కు సరిపడా స్టాక్‌ను జిల్లా వ్యవసాయ శాఖ ద్వారా ఎప్పటికప్పుడు తెప్పించడం జరుగుతుందని తెలిపారు. రైతులు నానో యూరియా, నానో డిఏపిలపైన మొగ్గు చూపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి కిరణ్మయి, వ్యవసాయ విస్తరణ అధికారి ముత్యం తిరుపతి, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ గణపతిలు పాల్గొన్నారు.