calender_icon.png 18 October, 2025 | 9:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు 42% శాతం రిజర్వేషన్లు కల్పించాలి

18-10-2025 04:16:12 PM

చిట్యాల,(విజయక్రాంతి): రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించాలని చిట్యాల మండల కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి అన్నారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని వ్యాపార వాణిజ్య, షాపులను మూసి వేయించి బంధులో పాల్గొన్నారు.

అనంతరం భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గూట్ల తిరుపతి మాట్లాడుతూ... రాష్ట్రంలో ఎన్నికల ముందు రాహుల్ గాంధీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ఇచ్చిన మాటకు బీజేపీ అడ్డుపడటం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర బీసీ జేఏసీ ఐక్య కార్యాచరణ సంఘం తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ఈరోజు రాష్ట్ర బంద్ లో పాల్గొన్నానని చెప్పారు.

ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి 42 శాతం బీసీ రిజర్వేషన్ పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ చేయించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ గుమ్మడి శ్రీదేవి ,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య,చిలుకల రాయకుమురు, ఏకు రవి, గడ్డం కొమురయ్య,తడుక కుమార్,బుర్ర శ్రీనివాస్,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అల్లకొండ కుమార్,చిలుముల రాజ మొగిలి తదితరులు పాల్గొన్నారు.