23-10-2025 05:50:39 PM
నిర్మల్ రూరల్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ జిల్లా బాధ్యులు రామగిరి రవీందర్ అన్నారు. గురువారం నిర్మల్ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. తక్షణమే కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికై కేంద్రంపై బలమైన ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా బీసీలకు ఎస్సీ, ఎస్టీల వలె రక్షణ చట్టాలు కల్పించాలన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించాలని సాధన సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద శుక్రవారం మహాధర్నను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ధర్నాలో జిల్లా నుంచి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో జిల్లా ముదిరాజ్ సంఘం జిల్లా బాధ్యులు పాతర్ల హరీష్, గౌరవాధ్యక్షుడు బర్మ చిన్నయ్య,రాజు, సిలారి శ్రీనివాసులు, తదితరులు ఉన్నారు.