calender_icon.png 24 October, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైమాస్ట్ లైట్లు ప్రారంభించిన ఎమ్మెల్యే, సుడా చైర్మన్

23-10-2025 10:05:59 PM

వెలిచాలలో హైమాస్ట్ లైట్లు స్విచ్ ఆన్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి..

సుడా నిధులు 20 లక్షలతో జగిత్యాల రోడ్డు నుండి వెలిచాల గ్రామం వరకు హైమాస్ట్ లైట్ల వెలుగులు..

కరీంనగర్ (విజయక్రాంతి): సుడా నిధులు 20 లక్షలతో జగిత్యాల మెయిన్ రోడ్డు వైపు నుండి వెలిచాల గ్రామం వరకు హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేసి వాటిని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిలు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ పలు అభివృద్ధి పనులకు సుడా నిధులు చైర్మన్ నరేందర్ రెడ్డి వైస్ ఛైర్మన్ ప్రఫుల్ దేశాయ్ లతో చర్చించి మంజూరు చేపిస్తున్నామని రాబోయే రోజుల్లో చొప్పదండి నియోజకవర్గానికి సుడా పరిధిలో మరిన్ని అభివృద్ధి పనులకు సుడా నిధులు కేటాయించాలని సూచించారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ అవసరమైన చోట అదేవిధంగా మంత్రుల మరియు ఎమ్మెల్యేల సూచనల మేరకు తప్పకుండా అభివృద్ధి నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీర్ల వెంకటేశ్వర్ రావు, జవాజీ హరీష్, వీర్ల నర్సింగ రావు, కాడే శంకర్ డిఈ రాజేందర్ ప్రసాద్, ఏఈ సతీష్ తదితరులు పాల్గొన్నారు.