calender_icon.png 28 December, 2025 | 11:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జడ్జిల నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించాలి

28-12-2025 12:00:00 AM

  1. న్యాయ వ్యవస్థలో బంధు ప్రీతి కొనసాగుతుంది

బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య

ముషీరాబాద్, డిసెంబర్ 27 (విజయక్రాంతి): సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జనా భా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క్రింది స్థాయి కోర్టులలో రిజర్వేషన్లు ఉన్నందున పటిష్టంగా అమలు చేయాలని కోరారు. ఈ మేరకు శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ బీసీ న్యాయవాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2016 - నూతన సంవత్సరం క్యాలెండర్, సంఘం ’లోగో’ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు.

ప్రజాస్వామ్యంలో జనాభా ప్రకారం వాటా ఇవ్వడం మౌలిక సూత్రమని, అది ధర్మమని, ఇది బీసీలకు ఇచ్చే బిచ్చం కాదన్నారు. న్యాయ వ్యవస్థలో బం ధుప్రీతి కొన సాగుతుందని, తండ్రి, కొడుకు, తమ్ముడు, అల్లుళ్లు ఇలా ఒక వర్గం చేతిలోనే న్యాయ వ్యవస్థ కేంద్రీకృతం అవుతున్నదని, ఇందు లో మెరిట్, నమర్థత, అంకితాభావం ఎక్కడున్నదని ఆయన ప్రశ్నించారు. కొలిజియం పద్దతిని రద్దు చేసి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో జుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి జడ్జిల నియామక విధానాన్ని అమలు చేయాలని కోరారు. న్యాయ వ్యవస్థలో జరుగుతు న్న అన్యాయంపై ప్రజాస్వా మ్య పోరాటం ఉండాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలకు న్యాయం జరగాల్సిన న్యాయ వ్యవస్ధలోనే అన్యాయం జరుగుతున్నదని ఆరోపించారు.

కోర్టులపై ఎస్సీ, ఎస్టీ, బీసీల వ్యతిరేక ముద్ర పడకూడదని అన్నారు. బీసీల 42 శాతం రిజర్వేషన్ సమర్థవంతంగా వా దించినప్పటికి జడ్జిలు వ్యతిరేకంగా ఉంటే కేసు కొట్టివేయ బడుతుందని అన్నారు. సమాన్య వ్యక్తిగత అడ్వకేట్లలో కాదని, వ్యవస్థలోనే ఉందన్నారు. ప్రతి జూనియర్ అడ్వకేట్ కు నెలకు రూ. 20 వేల ఉపకార వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. బీసీ అడ్వకేట్లలో స్టాండ్ మారాలని, హుందా ఉండాలని, వేషం, భాష, నడక మార్చాలని సూచించారు. న్యాయం కోసం, సమానత్వం కోసం, బహుజనుల వాటా కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సభలో సంఘం రాష్ట్ర కన్వీనర్ డి.శ్రీధర్, బీసీ నాయకులు నీల వెంకటేష్ ముదిరాజ్, బోర సుభాష్, సి. రాజేందర్ ముదిరాజ్, టి. రాజ్ కుమార్, జక్కుల వంశీకృష్ణ, జ్యోతి, చిక్కుడు బాలయ్య తదితరులు పాల్గొన్నారు.