28-12-2025 12:00:00 AM
గతేడాదికంటే 16.84 శాతం తగ్గుదల
మహిళలపై తగ్గిన నేరాలు
సైబర్ నేరాల్లో
రూ.1.10 కోట్ల రికవరీ
వెల్లడించిన కరీంనగర్
సీపీ గౌస్ అలం
కరీంనగర్, (విజయక్రాంతి): కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో గతేడాదితో పోల్చితే నేరాల సంఖ్య తగ్గిందని సీపీ గౌస్ అలం వెల్లడించారు. 2025లో నేరాల నియంత్రణ పురోగతిపై శనివారా క్యాంపు కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. 2024తో పోలిస్తే 2025లో మొత్తం నేరాలు 16.84 శాతం తగ్గినట్లు పేర్కొన్నారు. ఘోర నేరాలు 9.09 శా తం తగ్గగా, మహిళలపై నేరాలు 5.18 శాతం తగ్గినట్లు తెలిపారు. ఆస్తి నేరాల్లో 3.73 శాతం స్వల్ప పెరుగుదల నమోదైనప్పటికీ, వాటి గుర్తింపులో 10 శాతం, రికవరీలో 24 శాతం వృద్ధి సాధించినట్లు వెల్లడించారు. రూ.4.11 కోట్ల విలువైన ఆస్తి కేసుల్లో రూ.2.04 కోట్లకుపైగా తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
2,437 సైబర్ మోసాలపై ఫిర్యాదులు అందగా, 280 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కోర్టుల ఆదేశాల మేరకు బాధితులకు రూ.1.10 కోట్లకు పైగా నగదు తిరిగి చెల్లించామని తెలిపారు. సిఈఐఆర్ పోర్టల్ ద్వారా 500కు పైగా కోల్పో యిన మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు వెల్లడించారు. షి టీమ్ ద్వారా 247 అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా, మానవ అక్ర మ రవాణా కేసుల్లో తొమ్మిది మంది బాధితులను రక్షించినట్లు తెలిపారు.
29 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోగా, గ్యాంబ్లిం గ్కు సంబంధించి 58 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమ ఇసుక రవాణాపై 170 కేసులు నమోదు చేసి, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ట్రాఫి క్ నియంత్రణలో భాగంగా 2025లో 3.83 లక్షల ఈ-చలాన్ కేసులు నమోదు కాగా, లేజర్‌గన్ ద్వారా 17,491 వేగం ఉల్లంఘన కేసులు గుర్తించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ వెంకటరమణ, భీంరావు, ఏ సీపీ పాల్గొన్నారు.
విజయక్రాంతి క్యాలెండర్ ఆవిష్కరణ
కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో విజయక్రాంతి దినపత్రిక నూతన క్యాలెండర్‌ను సీపీ గౌస్ అలం శనివారం ఆవిష్కరించారు. శాంతి భద్రతల పరిరక్షణలో పత్రికల పాత్ర కీలకమైనదని ఆయన చెప్పారు.