13 March, 2026 | 6:28 PM

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

13-03-2026 12:00 AM

రాజ్యసభ ఎంపీ వేం నరేందర్‌రెడ్డికి - తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి వినతి 

హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం నుంచి నూతనంగా రాజ్యసభ సభ సభ్యుడు వేంరెడ్డి నరేందర్‌రెడ్డిని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జాక్ ప్రతినిధులు గురువారం సచివాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. అలాగే తెలంగాణ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని వినతిపత్రం సమర్పించారు. జేఏసీ ప్రతినిధుల వినతిపై  సానుకూలంగా స్పందించిన ఎంపీ ప్రభుత్వ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఎంపీని కలిసిన వారిలో డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె.రామకృష్ణ, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్స్ వెంకట్ రెడ్డి, శకుంతల, గీత, టీజీటీఏ అధ్యక్షులు రాము లు, మహిళా విభాగం అధ్యక్షురాలు రాధ, టీజీఆర్‌ఎస్‌ఏ జనరల్ సెక్రటరీ బిక్షం, టీజీటీఏ అసోసియేట్ ప్రెసిడెంట్ చల్ల శ్రీనివాస్, సీపీఎస్ అధ్యక్షుడు దర్శన్ గౌడ్, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు డా.నిర్మల, తపస్ అధ్యక్ష, కార్యదర్శులు రాజశేఖర్, పెం టయ్య, ప్రైమరీ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మహిపాల్ రెడ్డి, వెంకటేష్, రెవెన్యూ కంప్యూటర్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు భూమేష్, రఘుపతి, జీపీ వో సంఘం అధ్యక్షులు కే సుభన్ ఉన్నారు.