శ్రీవారి బ్రహ్మోత్సవాల వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
13-03-2026 12:00 AM
ఎర్రుపాలెం మార్చి 12 (విజయ క్రాంతి): శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు తేదీ. 19.03.2026 నుండి 28.03.2026 వరకు నిర్వహించబడు శ్రీ వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాల గోడపత్రిక మరియు కరపత్రమును తెలంగాణ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుత భట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగినది. ఆహ్వాన పత్రికను స్వామివారి శేష వస్త్రములు,
ప్రసాదము అందించి స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం జరిగింది. కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి కొత్తూరు జగన్ మోహన్ రావు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయ దేవశర్మ, గ్రామ సర్పంచ్ తుళ్లూరు నిర్మలా కుమారి , వకుళమాత స్టేడియం నిర్మాణదాత తుళ్లూరు కోటేశ్వరరావు గారు, ఆలయ ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాస్ శర్మ గారు పాల్గొన్నారు.




