calender_icon.png 23 May, 2025 | 1:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదవీ విరమణ పొందనున్న అధికారికి ఘన సన్మానం

22-05-2025 07:46:18 PM

మందమర్రి (విజయక్రాంతి): ఈనెల 31న పదవి విరమణ పొందనున్న జిఎం సివిల్ కార్పొరేట్ టీ సూర్య నారాయణను ఏరియా సింగరేణి అధికారులు ఘనంగా సన్మానించారు. ఏరియా పర్యటనలో భాగంగా గురువారం ఏరియా జీఎం కార్యాలయంకు చేరుకోగా ఏరియా ఎస్ఓటు జిఎం విజయ ప్రసాద్(Area SOTU GM Vijaya Prasad) ఆధ్వర్యంలో అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హల్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయనను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్ఓటు జీఎం మాట్లాడుతూ... ఈ నెలలో పదవీ విరమణ పోందనున్న కార్పొరేట్ సివిల్ జీఎం సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాలలో విధులు నిర్వహించి అందరి ఆదరాభిమానాలు చూరగొన్న అధికారి అని ఆయన సంస్థకు అందించిన సేవలను కొనియాడారు. సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న ప్రతి అధికారికి పదవి విరమణ అనివార్యం అన్నారు, పదవి విరమణ అనంతరం వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజనీర్ ఈఅండ్ఎం వెంకటరమణ, ఎస్కే గ్రూప్ ఏజెంట్ ఖాదిర్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ రవీందర్, డీజీఎం, ఐఈడి రాజన్న, సివిల్ ఎస్ఈ రాము, సివిల్ ఎస్ఈ జయప్రకాష్, డీజీఎం ఎఫ్ అండ్ ఎ ఆర్విఎస్ఆర్ కే ప్రసాద్, ఏరియా సీనియర్ అధికారులు పాల్గొన్నారు.