calender_icon.png 5 August, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించండి

05-08-2025 01:11:58 AM

అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్. కీమ్య నాయక్

వనపర్తి, ఆగస్టు 4 (విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్. కీమ్య నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యంతో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ప్రజావాణి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ఫిర్యాదు దారులకు తగిన సమాచారం అందించాలని సూ చించారు. ముఖ్యమంత్రి ప్రజావాణి, మంత్రి ద్వారా ఈ జిల్లాకు సంబంధించిన ప్రజావా ణి ఫిర్యాదులు, ప్రతి సోమవారం జిల్లా ప్ర జావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పు డు పరిష్కరించాలని సూచించారు. ఈరోజు ప్రజావాణికి మొత్తం 53 ఫిర్యాదులు వచ్చా యి.

అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య ఇప్పటివరకు ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ లో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన ప్రజా వాణి దరఖాస్తులు, మంత్రి నుండి వచ్చిన దరఖాస్తులు, కలెక్టర్ కార్యాలయాని వచ్చిన దరఖాస్తుల పెండింగ్ వివరాలను వివరించారు. వచ్చే వారం లోగా దరఖాస్తులు అన్ని పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.