05-08-2025 01:11:22 AM
గుడి, చర్చి, అంబేద్కర్ విగ్రహానికి రూ. 4.12 లక్షల విరాళం
చేవెళ్ల, ఆగస్టు 4: చేవెళ్ల మండలం ముడిమ్యాల పీఏసీఎస్ చైర్మన్ గోనె ప్రతాప్ రెడ్డి దాతృత్వాన్ని చాటుకున్నారు. సోమవారం ఆయన బర్త్ డే సందర్భంగా మత సామరస్యాన్ని, సామాజిక చైతన్యాన్ని ప్రదర్శిస్తూ.. గుడి, చర్చి, అంబేద్కర్ విగ్రహానికి రూ. 4.12 లక్షలు విరాళం అందించారు.
మండలంలోని దేవరం పల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఆంజనేయ స్వామి దేవాలయానికి రూ.2,01,000 , తంగడపల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కోసం రూ.51 వేలు, న్యాలట అగాపే సంపూర్ణ సువార్త సంఘం చర్చికి రూ. 1,60,000 డొనేట్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాలట కాంగ్రెస్ పార్టీ విలేజ్ ప్రెసిడెంట్ చిట్టంపల్లి వెంకటేష్ , తంగడపల్లి గ్రామ అంబేద్కర్ సంఘం నాయకులు ప్రేమ్ కుమార్, జగన్నాథ్, జంగయ్య, విజయ్, పోచయ్య, గొంగుపల్లి రాఘవేందర్, తదితరులు పాల్గొన్నారు.