09-09-2025 01:06:31 AM
కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): ప్రగతినగర్ శ్మశానవాటిక సమస్య ను పరిష్కరించాలని ప్రగతినగర్ వ్యవస్థాపకులు, మాజీ ఉపసర్పం చల్లా సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలకతీతంగా, అసోసియేషన్ కు అతీతంగా ప్రగతినగర్ ప్రధాన సమస్యలపై నిజాంపేట్ మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎండీ సాబెర్ అలీతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రగతినగర్ ప్రధాన సమస్య శ్మశాన వాటిక సమస్య, అంబిర్ సరస్సు ఆక్రమణలు, బతుకమ్మ ఘాట్ అభివృద్ధి అంశాల పై చర్చించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా స్మ శానవాటికను ఉపయోగిస్తున్నామని, స్మశానవాటికను అభివృద్ధి చేసి ప్రజలకు సౌకర్యా లు కల్పించాలని కమిషనర్‌ను అభ్యర్థించారు. వర్షాకాలంలో అత్యవసర బృందాల ఏర్పాటు, వినాయక చవితికి సౌకర్యాలు కల్పించి విజయవంతం చేసినందుకు కమిషనర్ సాబెర్ అలీకి అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో ఎన్ ఎంసి మాజీ కార్పోరేటర్లు చిట్ల దివాకర్, చల్లా ఇంద్రజిత్ రెడ్డి, అరవింద్ నాయుడు, తులసి దాస్, వెంకటరాజ్యం, ఉప్పు జస్వంత్, ఎక్స్ ఆల్విన్ ఉద్యోగుల సంఘం రమేష్, నబి, సీనియర్ సిటిజన్లు కామయ్య తదితరులున్నారు.