09-09-2025 01:07:44 AM
200 మంది ఫిజియోథెరపిస్టులు హాజరు
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): అంతర్జాతీయ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని పురస్కరించుకొని కిమ్స్ హాస్పిటల్స్‌లో సోమవారం ఫిజయోథెరపీ అవగా హన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కిమ్స్ రీహాబీలిటేష్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ సుధీంద్ర వూటూరి మాట్లాడుతూ.. 2030 నాటికి ప్రపంచంలో 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగిన వారు సుమా రు 1.4 బిలియన్ మందిగా ఉంటారని, 2050 నాటికి ఇది 2.1 బిలియన్ కు పెరిగే అవకాశముందని పేర్కొన్నారు.
ఎక్కువ మంది ఎక్కు వ కాలం జీవించే పరిస్థితిలో, వృద్ధులలో చల నం, బలం, శ్రేయస్సు కలిగించేందుకు ఫిజియోథెరపీ వంటి మద్దతు వ్యవస్థలు ఎంతో అవసరమన్నారు. 2025 సంవత్సరంలో ‘ఆరోగ్యంగా వృద్ధాప్యంలోకి ప్రవేశించడం‘ అనే అంశంపై దృష్టి పెట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా బలహీనత మరియు పడిపోవడం నివారించడంపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది ఫిజియోథెరపిస్టులు మరియు ఫిజియోథెరపీ, ఆరోగ్య సాహాయ్య విభాగాల విద్యార్థులు హాజరయ్యారు. కిమ్స్ హాస్పిటల్స్ వైద్య విద్య డైరెక్టర్లు డాక్టర్ మణిమాలారావు మరియు డాక్టర్ రాజగోపాల్ (ఇద్దరూ 80 సంవత్సరాలు దాటి ఉన్న వారు) పాల్గొని మాట్లాడారు. వృద్ధాప్యం అనేది సహజమైన ప్రక్రియ. కానీ, మనం ఎలా వృద్ధాప్యంలోకి వెళ్తామన్నది ప్రభావం చూపుతుంది అన్నారు.