calender_icon.png 29 September, 2025 | 9:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోదాడ విశ్రాంత ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక

29-09-2025 07:31:43 PM

అధ్యక్ష కార్యదర్శులుగా వేనేపల్లి శ్రీనివాసరావు, పందిరి రఘువరప్రసాద్ లు తిరిగి రెండోసారి ఎన్నిక..

కోదాడ: కోదాడ విశ్రాంత ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం సోమవారం కోదాడ పబ్లిక్ ఆడిటోరియంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా వేనేపల్లి శ్రీనివాస్ రావు, కార్యదర్శిగా వరప్రసాద్ లు తిరిగి రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యవర్గంలో కోశాధికారిగా టి వీరబాబు అసోసియేట్ ప్రెసిడెంట్ గా వి జానయ్య, వైస్ ప్రెసిడెంట్ గా యజ్ దాని, భ్రమరాంబ, జాయింట్ సెక్రటరీగా భూపాల్ రెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీగా హాజీ నాయక్, జిల్లా కౌన్సిలర్లుగా డి వెంకట్ రెడ్డి, శంభయ్య, తిరుపతమ్మ, పబ్లిసిటీ సెక్రటరీగా బిక్షంలు ఎన్నికయ్యారు.

ఎన్నికల అధికారిగా జిల్లా అధ్యక్షులు రామిరెడ్డి వ్యవహరించారు. అనంతరం నూతన కార్యవర్గంతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు వేనపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ అందరి సహకారంతో కోదాడ సంఘ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతా రామయ్య, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుదర్శన్ రెడ్డి, బొల్లు రాంబాబు, జిల్లా, రాష్ట్ర, మండల భాద్యులకు ధన్య వాదాలు తెలిపారు.