calender_icon.png 29 September, 2025 | 9:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుర్గాదేవికి భక్తిశ్రద్ధలతో దీపారాధన

29-09-2025 07:33:59 PM

కరీంనగర్ క్రైమ్ (విజయక్రాంతి): శ్రీ దుర్గా దేవి నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా కరీంనగర్లోని కట్టరాంపూర్ గిద్దెపెరుమాండ్ల నగర్ యూత్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో దుర్గామాతకు భక్తిశ్రద్దలతో దీపారాధన నిర్వహించారు. సోమవారం దుర్గామాత శ్రీ మహా సరస్వతి గౌరీ మాత అవతారంలో దర్శనమిచ్చారు.  ఈ సంధర్బంగా ప్రముఖ వేద పండితుడు ఫణి శర్మ నేత`త్వంలో విద్యాబుద్దులు నేర్చుకునే బాల బాలికలు, చిన్నారులతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనలు అందించారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని దీపాలను అలంకరించి దీపారాధన చేశారు. ఈ కార్యక్రమంలో జిపి నగర్ ఉత్సవ కమిటీ సభ్యులు కట్టె కిరణ్, బండ సంపత్, సౌడోజు అభిలాష్, గోనె అనిల్ ,జంగ సంపత్, జంగిలి విష్ణు,పెద్దపల్లి శ్రీనాథ్ , చేతన్ క్రాంతి, గూడూరి వినోద్, తోట కుమార స్వామి, మహిళలు జ్యోతి, అంజలి, రమ్య, అనూష, స్వర్ణ, రేఖ, రేణుకాదేవి, స్వప్న, ప్రవళ్లిక తదితరులున్నారు.