29-09-2025 06:46:48 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రతి ప్రభుత్వ ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారిగా పని చేస్తున్న సజీవన్ పదవీ విరమణ పొందిన సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో ఏర్పాటు చేసిన పదవీ విరమణ కార్యక్రమానికి జిల్లా ఎస్.పి. కాంతిలాల్ సుభాష్, అధికారులతో కలిసి హాజరై సజీవన్ దంపతులను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేసి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందించడంలో ప్రభుత్వ ఉద్యోగి పాత్ర కీలకమైనదని అన్నారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి జీవితంలో పదవి విరమణ తప్పనిసరి అని, పదవి విరమణ పొందిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.