29-09-2025 07:55:02 PM
కూనంనేని సమక్షంలో 220కుటుంబాలు సిపిఐలో చేరిక
సేవల ఫలితంగానే సిపిఐని ఆదరిస్తున్ని నియోజకవర్గ ప్రజలు
నియోజకవర్గంలో సిపిఐకి తిరుగులేదు
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని
భద్రాద్రి కొత్తగూడెం/సుజాతనగర్ (విజయక్రాంతి): సుజాతనగర్ మండల సర్వారం, చుంచుపల్లి మండలం చుంచుపల్లి తండా, పాల్వంచ మండలం దండెలబోర గ్రామాలకు చెందిన 220 కుటుంబాలు ఆదివారం రాత్రి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా సమక్షంలో సిపిఐలో చేరారు. వీరికి ఎర్రకండువా కప్పి పార్టీలోని ఆహ్వానించారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వాన్ని అదించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కూనంనేని మాట్లాడుతూ ప్రజల కష్టాలు గుర్తించి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు.
గడిచిన ఇరవై నెలల కాలంలో ఎమ్మల్యేగా నియోజకవర్గ అభివృద్ధి, ప్రజాసమస్యల పరిష్కారం కోసం అనునిత్యం క్రమిస్తున్నాని, పరకాల అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. నియోజకవర్గంలో సిపిఐకి తిరుగులేదని, ప్రజలకు అందిస్తున్న సేవలింగా ప్రజ సిపిఐని ఆదరిస్తున్నారని అన్నారు. నూతనంగా పార్టీలో చేరుతున్న వారు ప్రజాసేవలను విస్తరించడం ద్వారా పార్టీని మరింత అభివృద్ధి చేయాలని, వచ్చే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు వాసిరెడ్డి మురళి, కంచర్ల జమలయ్య, నాయకులు రాంచందర్, బానోతు గోవిందు, మన్నెం వెంకన్న, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.