29-09-2025 07:41:29 PM
మాజీ సర్పంచ్లు ఎర్నేని వెంకటరత్నం బాబు, కుసుమ దంపతులు..
కోదాడ: బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం అని కోదాడ మాజీ సర్పంచులు ఎర్నేని వెంకటరత్నం బాబు కుసుమ దంపతులు అన్నారు. ఆదివారం రాత్రి కోదాడ పట్టణంలోని గోపిరెడ్డి నగర్ లో బతుకమ్మ సంబరాల్లో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూలనే దేవతలుగా భావించి పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ ప్రజలదన్నారు. మహిళలకు అత్యంత ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ అని గోపిరెడ్డి నగర్ బంగారు బతుకమ్మ కమిటీ అంబరాన్ని అంటే సంబరాలతో బతుకమ్మ పండుగ నిర్వహించడం అభినందనీయం అన్నారు. అనంతరం కమిటీ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముత్తవరపు పాండురంగారావు ముత్తి నేని సైడేశ్వరరావు నూనె సులోచన , అంజన్ గౌడ్, ఉప్పగల్ల శ్రీను,వెంకటాచారి గంధం పాండు సాతులూరి గురవయ్య, బంగారు బతుకమ్మ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.