calender_icon.png 29 September, 2025 | 8:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల సంక్షేమమే సహకార సంఘం లక్ష్యం

29-09-2025 06:41:21 PM

కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి

కోదాడ: రైతుల సంక్షేమమే కోదాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లక్ష్యం అని చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం కోదాడ సంఘం కార్యాలయంలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు దీర్ఘకాలిక, స్వల్ప కాలిక రుణాలు అందజేయడంలో సహకార సంఘం అగ్రస్థానంలో ఉందన్నారు. పాలకవర్గం సహకారంతో నేడు సూర్యాపేట జిల్లాలోని అత్యంత బలోపేతమైన వ్యవసాయ సహకార సంఘంగా ఉందన్నారు. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతిల సహకారంతో సహకార సంఘాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు.

ఈ సందర్భంగా దీర్ఘకాలిక రుణాలు పొందిన రైతులు సహజమైన మరణం పొందిన వారికి సంఘం నిధుల నుండి 5000 రూపాయలు తక్షణ సహాయం అందజేయడానికి తీర్మానించినట్లు పేర్కొన్నారు. సహకార సంఘం ద్వారా రైతులకు పశు పోషణకు అవసరమైన దుకాణాల ఏర్పాటుకు తీర్మానించినట్లు పేర్కొన్నారు. బాలాజీ నగర్ శ్రీరంగపురం గ్రామాల్లో స్థల సేకరణ జరిపి కోదాడ పీఏసీఎస్ ఆధ్వర్యంలో స్టాక్ పాయింట్లు నిర్మించేందుకు తీర్మానించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో బుడిగం నరేష్ కుమార్, రైతు సంఘం నాయకులు బొల్లు ప్రసాద్, కనగాల నారాయణ, డైరెక్టర్ లు శెట్టి శ్రీనివాస్, ప్రభాకర్ రావు కాసాని రమాదేవి సోంపొంగు పార్వతి గోబ్రా నాయక్ శ్రీరామ్ శెట్టి వెంకటేశ్వర్లు, చంద్రమౌళి, సీఈఓ మంద వెంకటేశ్వర్లు రైతు పాల్గొన్నారు.