calender_icon.png 29 September, 2025 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లి జ్ఞాపకార్థం భక్తులకు త్రాగునీటి వితరణ

29-09-2025 07:36:31 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని మారుతీ నగర్ లో సీనియర్ జర్నలిస్ట్ నిమ్మటూరి సాయికృష్ణ తన తల్లి రాజేశ్వరి జ్ఞాపకార్థం త్రాగు నీటిని అందించి ఉదారత చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ కిమ్సారపు సమ్మయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బతుకమ్మ ప్రాంగణానికి తరలివచ్చే భక్తులకు ముఖ్యంగా మహిళలకు త్రాగునీటిని అందించాలనే ఉద్దేశ్యంతో గత ఆరు సంవత్సరాలుగా త్రాగునీరు అందించడం అభినందనీయమని అన్నారు.

అలాగే, నిమ్మటూరి సాయి కృష్ణ మాట్లాడుతూ.. త్రాగునీటి కోసం మహిళలు ఇబ్బందులు పడడం గమనించి, ఉచితంగా నీటిని అందించేందుకు పూనుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాజకీయ ప్రముఖులు, భక్తులు సాయికృష్ణను అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్, టిఆర్ఎస్ నాయకులు తులసి లక్ష్మణామూర్తి, మున్సిపల్ సిబ్బంది శానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్, ప్రతాప రాజు, వెంకట్రాజం, కిరణ్, వెంకటేష్, కిషన్, అరవింద్, హరీష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.