29-09-2025 07:39:29 PM
అధిక సంఖ్యలో పాల్గొన్న క్రీడాకారులు, అభిమానులు
గరిడేపల్లి (విజయక్రాంతి): మండల పరిధిలోని వెల్దండ గ్రామంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు సోమవారం రసవత్తరంగా సాగాయి. కాగా ఈ పోటీలలో పలు గ్రామాల నుండి వచ్చిన జట్లు అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారు. పోటీలలో ప్రథమ బహుమతి ఆలగడప జట్టు రూ. 25,016, ద్వితీయ చీదెళ్ల జట్టు రూ. 20,016, తృతీయ బహుమతి బేతవోలు జట్టు రూ.15,016, చతుర్ధ బహుమతి వెలుదండ జట్టు రూ. 10,016 లు గెలుపొందగా నిర్వాహకులు ఆయా జట్లకు బహుమతులు అందజేసి అభినందనలు తెలిపారు నిర్వాహకులు మాట్లాడుతూ గ్రామ యువతలో క్రీడా స్ఫూర్తిగా పెంపొందించడమే తమ లక్ష్యం అని తెలిపారు.