29-09-2025 07:44:32 PM
రంగులతో అలంకరించిన బతుకమ్మలు..
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో సోమవారం ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్, పాత సాయిబాబా ఆలయం, విద్యానగర్లోని శివాలయం, ధర్మశాల, కిష్టమ్మ గుడి ఆవరణలో, కాళికాదేవి ఆలయ ఆవరణలో, పాంచ్రస్తాలో మహిళలు బతుకమ్మలను పెట్టి ఆటలు, ఆడుతూ పాటలు పాడారు. తీరొక్క పువ్వుని పెట్టి మహిళలు పేర్చిన సద్దుల బతుకమ్మ చుట్టూ చేరి పాటలతో అలరించారు. జిల్లావ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో గ్రామాల్లో సైతం సద్దుల బతుకమ్మ ఆటలను మహిళలు పాడారు. స్థానికంగా ఉన్న చెరువులు, కుంటల్లో సద్దుల బతుకమ్మను నిమజ్జనం చేసి సద్దులను తీసుకెళ్లి భోజనాలు చేశారు. మళ్లీ రా గౌరమ్మ మా ఇంటి కంటూ మహిళలు బతుకమ్మలను నిమజ్జనం చేశారు.