10 May, 2026 | 10:19 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

వైభవంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

29-09-2025 07:51 PM

ముస్తాబాద్ (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో సోమవారం సాయంత్రం వైభవంగా సద్దుల బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. గ్రామంలోని ప్రధాన రహదారి, వీధుల్లో ఏర్పాటు చేసిన తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల వద్ద మహిళలు గంటన్నర పాటు బతుకమ్మ పాటలతో కనువిందు చేశారు. అనంతరం బతుకమ్మలను చెరువుల వద్దకు తీసుకెళ్లి వచ్చే ఏడాదికి తిరిగి రావమ్మా అంటూ నిమజ్జనం చేశారు. కష్టాలన్ని మర్చిపోయి సంతోషంగా వెంట తీసుకెళ్లిన ఫలహారాలు ఒకరికొకరు పంచిపెట్టుకొని తినడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు, పిల్లలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.