calender_icon.png 26 November, 2025 | 8:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచ్ ఎన్నికల్లో ఓట్ల కోసం మాత్రమే రేవంత్ రెడ్డి చీరలు పంచుతున్నారు

26-11-2025 08:11:48 PM

వడ్డీలేని రుణాలు ఇస్తున్నారు

మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి..

నిజామాబాద్ (విజయక్రాంతి): ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మహిళలకు ఇస్తానన్న 2500, 2000 పెన్షన్ 4000 చేయడం, కల్యాణ లక్ష్మీలో తులం బంగారంలాంటి హామీలో ఏ ఒక్కటి నెరవేర్చకుండా సర్పంచ్ ఎన్నికలో ఓట్ల కోసం చిన్న పిల్లలకు చాక్లెట్ లు ఇచ్చి బుజ్జగించినట్టు చేస్తున్నారు.

1. రేవంత్ రెడ్డి రెండు మూడు రోజుల నుండి గ్రామాల్లో మహిళలకు ఇందిరమ్మ పేరు మీద చీరలు పంచె కార్యక్రమం పెట్టుకున్నారు. మహిళ సోదరీమణులు ఆ చీరలు కట్టుకొని వచ్చి ఓట్లు వేయాలని ముఖ్యమంత్రి స్థాయిలో బహిరంగంగా అడుగుతున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో 114 గ్రామపంచాయతీలు, ఒక మున్సిపాలిటీ ఉంది.

రేవంత్ రెడ్డి ఓట్లు ఉన్న గ్రామల్లోని మహిళలకు మాత్రమే చీరలు పంచుతున్నారు, ఓట్లులేని భీంగల్ మున్సిపాలిటీ మహిళలకు చీరలు పంచడం లేదుదీన్ని బట్టి అక్క చెలెళ్లు ఆలోచించాలి రేవంత్ రెడ్డి సర్పంచ్ ఎన్నికల కోసం మాత్రమే చీరలు పంచి వాటి ద్వారా ఓట్లు రాబట్టు కోవాలని చూస్తున్నాడు కానీ మీకు ఇస్తానన్న 2500, 2000 నుండి 4000 చేస్తానన్న ఆసరా పెన్షన్, తులం బంగారం లాంటి హామీలు నెరవేర్చడం లేదు.

2. వడ్డీలేని రుణాలు అని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. 5 లక్షల లోపు రుణాలకు మాత్రమే వడ్డీ లేదు, 5 లక్షల కంటే ఎక్కువ రుణాలు తీసుకున్న మహిళ సంఘాలకు వడ్డీ వసూలు చేస్తున్నారు. ఈ వడ్డీలేని రుణాలు కూడా సర్పంచ్ ఎన్నికలు ఉన్న గ్రామాల మహిళ సంఘాలకు మాత్రమే ఇస్తు, ఎన్నికలు లేని మున్సిపాలిటీ మహిళ సంఘాలకు ఇవ్వటం లేదు. మున్సిపాలిటీలో ఉన్నవారు మహిళలు కాదా రేవంత్ రెడ్డి?  ఓట్లు ఉన్నాయి అని రేవంత్ రెడ్డి ఇవన్నీ చేస్తున్నాడు ఓట్లు లేకుంటే కనీసం జాకెట్ ముక్క కూడా రేవంత్ రెడ్డి ఇవ్వడు. జిల్లా, బాల్కొండ నియోజకవర్గం సోదరీమణులకు కూడా అన్ని అర్థమైనాయి.

3. ఎన్నికలు వస్తున్నాయి అని  రైతులను కూడా  రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో సగం మంది రైతులకు 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టారు. బాల్కొండ నియోజకవర్గంలో 52 వేల పై చిలుకు రైతులకు రుణమాఫీ కావాల్సి ఉండగా కేవలం 20 వేల రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి  ఇంకా 32 వేల మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టారు. ఎన్నికలప్పుడు అన్ని పంటలకు బోనస్ అన్నాడు తర్వాత మాట మార్చి సన్నాలకు మాత్రమే అన్నారు. ఆ బోనస్ కూడా ఈ ప్రభుత్వం వచ్చాక మొదటి పంట కు వేయలేదు,రెండో పంటకు 20 శాతం ఇచ్చి 80 శాతం రైతులకు ఎగ్గొట్టాడు, మూడో పంట యాసంగి కి పూర్తిగా ఎగ్గొట్టి ఇప్పుడు నాలుగో పంటకు  సర్పంచ్ ఎలక్షన్ లు వస్తున్నాయని మాత్రమే బోనస్ వేస్తున్నారు.

రైతు భరోసా కూడా అదే పరిస్థితి.. మొదటి పంటకు  కేసీఆర్ రైతు బంధు కోసం ఉంచిన డబ్బులే వేసాడు,రెండో పంట రైతు బంధు పూర్తిగా ఎగ్గొట్టాడు,మూడో పంటకీ రైతు బంధు సగం మంది రైతులకు ఇచ్చి సగం మందికి ఎగ్గొట్టాడు, నాలుగో పంట రైతుబందు ఎన్నికలు వస్తాయేమో అని క్విటాలుకు 7500 చొప్పున వేయాల్సింది 6000 చొప్పున  మాత్రమే వేసాడు.ఇలా ఎన్నికలు  వచ్చినపుడు మాత్రమే మహిళలకు, రైతులకు చాక్లెట్లు పంచినట్టు పంచి మోసం చేస్తూ ఓట్లు రాబట్టుకొనే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. మహిళలు రైతులు అన్ని గమనిస్తున్నారు.. రాబోయే ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.